అయినా పేలవమే..గాలివేగం అనుకూలంగా ఉండడంతో బుధవారం ఉదయం ఢిల్లీలో గాలినాణ్యత మెరుగుపడింది. అయినా, అది పేలవంగానే ఉంది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏఓఐ) బుధవారం ఉదయం 6 గంటలకు 262 వద్ద ఉంది, మంగళవారం సాయంత్రం 4 గంటలకు 303 నుంచి అదిమెరుగుపడడం విశేషం. దీపావళి రోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు 312. పొరుగున ఉన్ననగరాలైన ఘజియాబాద్ (262), నోయిడా (246), గ్రేటర్ నోయిడా (196), గురుగ్రామ్ (242) ఫరీదాబాద్ (243). “మితమైన” నుంచి “పేలవమైన” గాలి నాణ్యతను నివేదించాయి.