పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘కొమరం పులి చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు నికీషా పటేల్. ఆ చిత్రం పెద్దగా ఆడక పోయినా హీరోయిన్ నికీషా పటేల్ మంచి మార్కులే తెచ్చుకుంది. తర్వాత మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో నటించిన ఈ అమ్మడు.. టాలీవుడ్‌కు దూరమైంది. అక్కడా అంతగా సక్సెస్‌లు లేకపోవడంతో విదేశాలకు పయనమైంది. అయితే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. తాజాగా ఆమె పెళ్లి విషయాన్ని బయటపెట్టి అభిమానులను ఆశ్చర్యపరచింది. ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నట్లు త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె కూడా అది నిజమే అన్నట్లు గతంలో చిన్న హింట్ ఇచ్చారు. ఇక అభిమానులు ఆగుతారా… కాబోయే భర్త ఫొటో చూపించాలంటూ మెసేజ్‌లు పెట్టడంతో దీపావళి సందర్భంగా తన ప్రియుడి ఫొటోను షేర్ చేసింది నికీషా పటేల్. దీంతో పెళ్లెప్పుడూ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.
అయితే దీపావళి పండగ సందర్భంగా సోమవారం ఆమె ఇన్‌స్టాలో ఆమె ప్రియుడి ఫొటో షేర్ చేసిన నికీషా… మంగళవారం సాయంత్రానికి ఆ ఫొటోనే ఇన్‌స్టా నుంచి తొలగించారు. ఆ ఫొటోను డిలీట్ చేయడం వల్ల అతను స్నేహితుడా? ప్రియుడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. మరి నికీషా ఏం చెబుతుందో చూడాలి.