టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీమటపాకాయ్ సినిమా ద్వారా తన సినీ కెరియర్ ను మొదలుపెట్టిన పూర్ణ అతి తక్కువ సమయంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా డైరెక్టర్ రవిబాబు దర్శకత్వంలో వచ్చిన అవును , అవును 2 సినిమాలు చేసి మరింత గుర్తింపు సంపాదించుకుంది పూర్ణ. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది. నిజానికీ పూర్ణ తన కళ్ళతో .. అందంతో.. ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తరువాత మరెన్నో హార్రర్ మూవీలలో కూడా నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ , మలయాళ భాషలలో పలు సినిమాలను తీసింది. ఆ తరువాత ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా కొన్ని ప్రోగ్రాములలో జడ్జిగా వ్యవహరిస్తోంది పూర్ణ .
అంతేకాకుండా ఈ షోల ద్వారా ఎంతో మంచి గుర్తింపును కూడా తెచ్చుకుంది. ఇప్పుడు హీరోయిన్ గా పూర్ణ కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. మొన్నటి వరకు అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న పూర్ణ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా హీరోయిన్గా రాణించాలని కలలు కంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఆమెకు నిశ్చితార్థం మే 31న జరిగింది. ఆ తరువాత వీరి వివాహం జూన్ 12న జరిగింది. ఈ విషయం ఎవరికీ తెలియదని .. ఇప్పుడు దీపావళి పండుగ సందర్భంగా తన వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె దుబాయ్ కి చెందినవ్యాపారవేత్త ఫణిత్ ఆసిఫ్ అలీ ని అరబిక్ సాంప్రదాయ పద్ధతిలో చాలా ఘనంగా వివాహం చేసుకుంది. దుబాయిలో వీరి వివాహం చాలా ఘనంగా జరిగింది. కానీ పూర్ణ వివాహానికి వారి బంధువులు రాలేదు.
ఎందుకంటే వీసా ప్రాబ్లం ఉండటం వల్ల ఆమె అందర్నీ ఆహ్వానించలేకపోయింది. అయితే వారి కుటుంబ సభ్యుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది.అలాగే ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలను పూర్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వీరి వివాహానికి వారి బంధువులు లేరని రిసెప్షన్ ను కేరళలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.