హైదరాబాద్ : దీపావళి సందర్భంగా మహేశ్‌బాబు తనయ సితార క్లాసికల్ డ్యాన్స్ చేసింది. సంబంధిత వీడియోపై మహేశ్ ప్రశంసలు కురిపించారు. ప్రముఖ నటుడు మహేశ్‌బాబు తనయ సితార సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది. ఫొటోషూట్, విహార యాత్రలు, వేడుకలు ఇలా తాను ఎంజాయ్ చేసిన వాటన్నింటి వివరాలను ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే దీపావళిని పురస్కరించుకుని క్లాసికల్ డ్యాన్స్ చేసింది. సంబంధిత వీడియోను పోస్ట్ చేస్తూ పండగ శుభాకాంక్షలు తెలిపింది. తన గురువు మహతీ భిక్షుతో కలిసి నృతం చేయటం సంతోషంగా ఉందని పేర్కొంది. ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్ల రూపంలో సితారను ప్రశంసిస్తున్నారు. ఇదే వీడియోను మహేశ్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ‘నన్ను గర్వపడేలా చేయటంలో నువ్వు ఎప్పుడూ ఫెయిల్కావు’ అని సితారకు కితాబిచ్చారు.