ఆసియా ఖండంలోని 10 అత్యంత కాలుష్య నగరాల్లో భారత్కు చెందిన ఎనిమిది నగరాలున్నాయని, కానీ, ఆ జాబితాలో ఢిల్లీ లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ రిపోర్టును ట్విట్టర్ లో షేర్ చేశారు. కొన్నేళ్ల కిందట ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ కుడా ఒకటిగా వుండేదన్నారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని చెప్పారు.
అయితే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. “ఢిల్లీ ప్రజలు చాలా కష్టపడి పనిచేశారు. ఈరోజు మనం చాలా అభివృద్ధి చెందాం. మనం అభివృద్ధి చెందినా, అది ఇంకా చాలా దూరం ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తూనే ఉంటాం” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీవాసుల నిరంతర ప్రయత్నాల కారణంగా కాలుష్యం తగ్గుముఖం పట్టిందని, ఢిల్లీని ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కేజ్రివాల్ హామీ ఇచ్చారు.
మూలం: బిజినెస్ స్టాండర్డ్