యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..
అన్‌స్టాపబుల్ 2 తాజా ఎపిసోడ్ కోసం ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడైన మరో హీరో
గోపీచంద్ ను కూడా బాలకృష్ణ అన్‌స్టాపబుల్ వేదికపైకి తీసుకొచ్చారు. ఈ ఎపిసోడ్
డిసెంబర్ 30వ తేదీన ప్రీమియర్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ షో ప్రోమో వదిలి
ఆసక్తి పెంచేశారు. ప్రభాస్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పిన బాలకృష్ణ.. ఇక నన్ను
కూడా డార్లింగ్ అనే పిలవాలి అని చెప్పారు. దీనిపై అలాగే అని రిప్లై ఇచ్చారు
ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ పర్సనల్ మ్యాటర్స్ పై కూపీ లాగుతూ బాలకృష్ణ
ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ చర్చకు వచ్చింది.
శర్వానంద్ పెళ్లి ఎప్పుడు? నీ పెళ్లి తర్వాతనే కావొచ్చుగా అంటూ పరోక్షంగా
ప్రభాస్ పెళ్లి ఇష్యూ లేవనెత్తారు బాలకృష్ణ. దీంతో వెంటనే స్పందించిన
ప్రభాస్.. ‘నా పెళ్లి గురించి అడిగితే సల్మాన్ ఖాన్ తర్వాతే అనాలేమో’ అంటూ
ఫన్నీ రిప్లై ఇవ్వడం ఈ ప్రోమో వీడియోలో హైలైట్ సన్నివేశం. ఇదే ప్రోమోలో రామ్
చరణ్‌కు కూడా బాలకృష్ణ కాల్ చేయడం, ప్రభాస్ గురించిన ఏదో సీక్రెట్ విషయం అడగటం
చూడొచ్చు. ఇక గోపీచంద్‌ని కూడా తనదైన స్టైల్ లో ఇంటర్వ్యూ చేశారు బాలకృష్ణ.
మొత్తానికైతే తాజా ప్రోమో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేసిందని చెప్పుకోవచ్చు.