మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి హీరోయిన్గా మారిన అందాల భామ మానుషి చిల్లర్ .
మిస్ వరల్డ్ టైటిల్‌ను 2017లో కైవసం చేసుకుంది. సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో
బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో రాణి సంయోగిత పాత్రలో
కనిపించిన భామ.. ప్రస్తుతం వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని బాలీవుడ్ మీడియాలో
ప్రచారం జరుగుతోంది. భారత్‌లోనే అతిపెద్ద స్టాక్ బ్రోకరేజీ సంస్థ జీరోదా
సహవ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ తో ఆమె డేటింగ్ చేస్తుందని బీ టౌన్ మీడియాలో
గుసగుసలు వినిపిస్తున్నాయి. మానుషి చిల్లర్, నిఖిల్ కామత్ 2021 నుంచే
ప్రేమించుకుంటున్నారని సమాచారం. ఈ లవ్‌బర్డ్స్ తమ రిలేషన్ షిప్‌ను మాత్రం
ఎప్పుడు బయటపెట్టలేదు. కానీ, కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని
తిరుగుతున్నారని తెలుస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ట్రిప్‌లకు వెళ్తూ ఎంజాయ్
చేస్తున్నారట. తాజాగా రిషికేశ్కు వెళ్లారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్
మీడియాలో వైరల్‌గా మారాయి. ‘‘ఈ జంట మధ్య బంధం చాలా దృఢంగా ఉంది. ప్రస్తుతం
మానుషి బాలీవుడ్ కెరీర్‌పైనే దృష్టి సారించింది. తన వ్యక్తిగత జీవితానికి
సంబంధించిన విశేషాలను పంచుకోవడం ఆమెకు ఇష్టం లేదు. అందువల్లే బయటకు చెప్పడం
లేదు. ఈ జంట ప్రేమించుకుంటున్నారనే విషయం ఇరు కుటుంబాల వారికి, సన్నిహితులకు
తెలుసు’’ అని మానుషి, నిఖిల్‌తో సన్నిహితంగా మెలిగేవారు చెప్పారు. నిఖిల్
కామత్‌కు గతంలోనే పెళ్లి అయింది. అమందా పూర్వంకర తో 2019లో ఏడడుగులు వేశాడు.
ఒక్క ఏడాదికే ఈ జంట విడిపోయారు. 2021లో విడాకులు తీసుకున్నారు. మానుషి
చిల్లర్, నిఖిల్ కామత్‌తో సహా వారి పీఆర్ టీమ్ ప్రేమ విషయంపై మాట్లాడటానికి
నిరాకరించింది.