ప్రఖ్యాత సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా డాక్టరేట్ అందుకున్నారు.
తమిళనాడులోని దిండుగల్ జిల్లా చిన్నాలపట్టిలో వున్న గాంధీగ్రామ్
విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ..
ఇళయరాజాతో పాటు మృదంగ విద్వాంసుడు ఉమయాల్పురం శివరామన్లకు గౌరవ డాక్టరేట్లు
ప్రదానం చేశారు. శుక్రవారం సాయంత్రం బెంగళూరు నుంచి దిండుగల్ చేరుకున్న
ప్రధాని ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్ర సహాయమంత్రి
ఎల్.మురుగన్ తదితరులు పాల్గొన్నారు.