గ్రామీ అవార్డు విజేత, మ్యూజిక్ స్టార్ రాఫర్ కూలియో లాస్ ఏంజిల్స్‌లో 59 సంవత్సరాల వయస్సులో మరణించినట్లు అతని మేనేజర్ జారెజ్ పోసీ ధృవీకరించారు. కూలియో తన 1995 సింగిల్ గ్యాంగ్స్టాస్ ప్యారడైజ్‌కు ప్రసిద్ధి చెందాడు. దాని కోసం అతను ఉత్తమ సోలో ర్యాప్ ప్రదర్శన నిర్వహించి గ్రామీ అవార్డును గెలుచుకున్నాడు. 1980ల చివరలో ప్రారంభమైన కెరీర్లో మరో ఐదు గ్రామీలకు రాఫర్ కూలియో నామినేట్ అయ్యాడు. నిజానికి కూలియో అసలు పేరు లియోన్ ఐవీ. అయితే హాలీవుడ్‌లోకి వచ్చాక రాఫర్ కూలియోగా పేరు మార్చుకున్నాడు. రాఫర్ తన స్నేహితుని ఇంట్లో మరణించాడని మేనేజర్ జారెజ్ పోసీ వెల్లడించాడు. అయితే మరణానికి గల కారణం మాత్రం తెలపలేదు.