ఈ క్రిస్మస్ కి ‘హాయ్ నాన్న’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కథానాయకుడు
నాని. నాని -మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు
శౌర్యువ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ చెరుకూరి, తీగల విజేందర్
రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ కీలక పాత్ర పోషిస్తోంది.
ముగింపు దశలో ఉన్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ గా కూనూర్ లో ప్రారంభమైంది. ఈ
విషయాన్ని నాని సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ఈ షెడ్యూల్లో భాగంగా
నానిపై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించనున్నారు. త్వరలో తొలి
గీతాన్ని విడుదల చేసి ప్రచార కార్యక్రమాల్ని ప్రారంభించనున్నారు.
తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో తెరకెక్కుతున్న
సినిమా ఇది. చక్కటి కుటుంబ కథా చిత్రంగా ఉంటుంది అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో నానికి కూతురుగా బేబీ కియారా ఖన్నా నటిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహబ్
సంగీతమందిస్తున్నారు. సాను జాన్ వర్గిస్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ
సినిమా డిసెంబరు 21న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి
విడుదల కానుంది.