పవన్ కల్యాణ్
కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ” (ఒరిజి నల్ గ్యాంగ్ స్టర్) సుజీత్
దర్శకుడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
పవర్ఫుల్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో పవన్
కల్యాణ్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి
సంబంధించిన ఓ భారీ షెడ్యూల్ ను థాయ్ లాండ్, బ్యాంకాక్ లో
తెరకెక్కించబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే చిత్ర బృందం థాయ్ లాండ్ కు
వెళ్లిందని, అక్కడ భారీ యాక్షన్ ఎపిసోడు చిత్రీకరించేందుకు ప్రయత్నాలు
చేస్తున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్
జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్ర టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు
సమాచారం. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో
కనిపిస్తారని చెబుతున్నారు. ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి తమన్ సంగీతాన్నందిస్తున్నారు.