ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు షారుక్ ఖాన్ తన రాబోయే చిత్రం ‘జవాన్’తో మరోసారి
ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్నారు. అట్లీ ఈ చిత్రాన్ని
తెరకెక్కిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ
సినిమా పోస్టర్, ప్రివ్యూ ట్రైలర్ తో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
తాజాగా ఈ సినిమాలోని కొత్త మోషన్ పోస్టర్ ను ఇన్ స్ట్రా వేదికగా పంచుకున్నారు
షారుక్. ‘న్యాయానికి ఎన్నో ముఖాలు. ప్రతి ముఖం వెనుక ఒక కథ ఉంటుంది. ఇది ఆరంభం
మాత్రమే. వేచి ఉండండి’ అని వ్యాఖ్యాల్ని జోడించారు. ఇందులో ఐదు విభిన్న
అవతారాలలో కనిపిస్తూ, అభిమానులను ఆకట్టుకుంటున్నారు షారుక్, ఈ సినిమాలో ఆయన
ద్విపాత్రాభినయం చేస్తున్నారు. విభిన్న రూపాలలో ఉన్న షారుక్ చూసి ఈ సినిమా కథ
ఏవిధంగా ఉండనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్
నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో
నటిస్తున్నారు. వచ్చే నెల 7న ఈ సినిమా విడుదల కానుంది.