news descriptionసంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన గంగూబాయి కారియావాడి
చిత్రంలో ప్రధాన పాత్రను పోషించిన అలియాభట్, “మిమి’ చిత్రంలో నటించిన కృతిసనన్
ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటి అవార్డును సంయుక్తంగా గెలుచుకున్నారు. వేశ్యగా
జీవితాన్ని ప్రారంభించిన గంగుబాయి కామాటిపురకు నాయకురాలిగా ఎలా ఎదిగింది? ఈ
క్రమంలో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏమిటి? దాదాపు నాలుగువేల మంది మహిళల హక్కుల కోసం
ఆమె చేసిన పోరాటం ఏమిటి? అనే అంశాలను ఈ సినిమాలో చూపించారు. ‘మాపియా క్వీన్స్
ఆఫ్ ముంబై’ అనే నవల ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియాభట్ నటన అందరి
ప్రశంసలందుకుంది. ఈ పాత్రలో ఆమె హావ భావాలు, గాంభీర్యత, సంభాషణలు శభాష్
అనిపించాయి. ఇక ‘మిమి’ చిత్రంలో కృతిసనన్ తనదైన నటనతో మెప్పించింది. అద్దె
గర్భం నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మిమి పాత్రలో కృతిసనన్
చక్కగా ఒదిగిపోయింది. సరోగసీ నేపధ్యంలో చాలా చిత్రాలొచ్చినా వాటిలో “మిమి’
ప్రత్యేకంగా నిలిచిపోయింది. ముఖ్యంగా కృతిసనన్ కెరీర్ లోనే బెస్ట్
పర్ఫార్మెన్స్ కనబరచింది.