రాశీ ఖన్నా నటిస్తుంది, కవిత్వం రాస్తుంది, పాటలూ పాడుతుంది. ఇప్పటికే రెండు
మూడు సినిమా పాటలు పాడేసింది. తాజాగా మరోసారి తన గళం విప్పింది. సాయిధరమ్
తేజ్, స్వాతి కలసి నటించిన ‘సత్య’ అనే ఓ మ్యూజికల్ షార్ట్ కోసం పాట పాడింది. ఈ
షార్ట్ ఫిల్మ్ ను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించారు. మూడు భాషల్లోనూ
రాశీఖన్నానే ఈ పాట పాడడం విశేషం. నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వం వహించారు.శ్రుతి
రంజని స్వరాలు సమకూర్చారు. అమె సాహిత్యం కూడా అందించారు. బుధవారం ఈ గీతాన్ని
విడుదల చేశారు.