‘దసరా’తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొన్నారు నాని. ఆయన హీరోగా
రూపొందుతున్న ‘హాయ్ నాన్న’ చిత్రం సెట్స్ పైన ఉంది. ఈలోగా మరో రెండు
చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఓ చిత్రానికి వివేక్ ఆత్రేయ
దర్శకత్వం వహిస్తారు. డివివి. దానయ్య నిర్మాత. ‘హాయ్ నాన్న’ తర వాత సెట్స్
పైకి వేళ్లే చిత్రమిది. మరోవైపు తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి చెప్పిన కథకు
నాని పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది. శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా
వ్యవహరిస్తారు. వివేక్ ఆత్రేయ సినిమాతో పాటుగా దీన్ని కూడా సమాంతరంగా పూర్తి
చేయాలని నాని భావిస్తున్నారు. మరోవైపు నాని సొంత నిర్మాణ సంస్థ ‘వాల్ పోస్టర్
బ్యానర్ పై నిర్మించే చిత్రానికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా
పూర్తయినట్టు టాక్. పూర్తి వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.