‘ఘోస్ట్’ తరువాత నాగార్జున తన సినిమాతో ప్రేక్షకులను పలకరించలేదు. ఈమధ్య ఆయన
చాలా కథలు విన్నారు. కొన్నింటిని పక్కన పెట్టారు. వరుస వైపల్యాల నేపథ్యంలో
ఈసారి రిస్క్ తక్కువగా ఉండే సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా
మలయాళంలో సూపర్ హిట్టయిన ‘పొరింజు మరియమ్ జోస్’ సినిమాని తెలుగులో రీమేక్
చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొన్న విజయ్ బిన్నీ ఈ చిత్రానికి
దర్శకత్వం వహిస్తారు. దీనికి ‘గలాటా’ అనే పేరు ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
కథానాయికగా కాజల్ ఎంపిక దాదాపుగా ఖాయమైంది. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే
తొలిసారి. నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక
ప్రటకన విడుదలయ్యే అవకాశం ఉంది. నాగ్ నటించే 99వ చిత్రమిది. మరో వైపు వందో
చిత్రానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో
నాగ్ తో పాటు అఖిల్, నాగచైతన్య కూడా కనిపిస్తారని సమాచారం అందుతోంది.