రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’,
నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి వంశీ
దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. ‘టైగర్ భయంకరమైన
దండయాత్ర మొదలైంది’ అంటూ చిత్రబృందం గురువారం టీజర్ నీ విడుదల చేసింది.
అక్టోబరు20న ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుంది. “హైదరాబాద్, బొంబాయి, ఢిల్లీ
ఇంకా అనేక నగరాల్లో అతి దారుణంగా దోపిడీలు చేసిన స్టూవర్ట్ పురం దొంగ మద్రాస్
సెంట్రల్ జైల్ నుంచి తప్పించుకున్నాడు…” అంటూ మొదలయ్యే టీజర్లో టైగర్
నాగేశ్వరరావుగా రవితేజ లుక్, ఆయన సాహసాలు సినిమాపై ఆసక్తిని
రేకెత్తిస్తున్నాయి. ‘నాగేశ్వరరావు పాలిటిక్స్ లోకి వెళ్లుంటే వాడి తెలివి
తేటలతో ఎలక్షన్స్ లో గెలిచేవాడు. స్పోర్ట్స్ లోకి వెళ్లుంటే వాడి పరుగుతో
ఇండియాకి మెడల్ గెలిచేవాడు. ఆర్మీలోకి వెళ్లుంటే వాడి ధైర్యంతో ఒక యుద్ధమే
గెలిచేవాడు. దురదృష్టవశాత్తూ వాడొక క్రిమినల్ అయ్యాడు’ అనే సంభాషణలు ఈ టీజర్
కి ఆకర్షణగా నిలిచాయి. చిన్న వయసులోనే నేరాలబాట పట్టిన స్టూవర్టుపురం దొంగ
టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది. ఇందులోని పాత్రకి
తగ్గట్టుగా రవితేజ ప్రత్యేకంగా సన్నద్ధమై నటించారు. రేణుదేశాయ్, అనుపమ్ ఖేర్,
మురళీశర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంభాషణలు: శ్రీకాంత్ విస్సా, సంగీతం:
జి.వి. ప్రకాశ్ కుమార్, ఛాయా గ్రహణం: ఆర్. మది, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్
కొల్లా.