విష్వక్ సేన్ కథానాయకుడిగా కృష్ణచైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. నేహాశెట్టి కథానాయికగా నటిస్తోంది. అంజలి కీలక
పాత్రలో కనిపించనుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యం సంయుక్తంగా
నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని
“సుట్టంలా సూసి…” అంటూ సాగే పాటని విడుదల చేశారు. యువన్ శంకర్ రాజా
స్వరకల్పనలోని ఈ పాటని శ్రీహర్ష ఈమని రచించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు.
పాట విడుదల సందర్భంగా విష్వక్సేన్ మాట్లాడుతూ “ఊర మాస్ సినిమా చేయాలనే కోరిక
ఎప్పటి నుంచో ఉండేది. తొలిసారి లుంగీ కట్టి ఈ సినిమాలో కనిపిస్తా. ఈ పాట
సాఫ్ట్ క్లాస్ గా వినిపిస్తున్నా.. సినిమా మాత్రం మాస్ గా ఉంటుంది. యువన్
శంకర్ రాజాకి నేను పెద్ద అభిమానిని. ఆయనతో కలిసి పనిచేయాలనే కల ఈ సినిమాతో
నెరవేరింది” అన్నారు. నేహా శెట్టి మాట్లాడుతూ ‘సితార సంస్థలో ‘డీజే టిల్లు’
చేశా. ఈ సినిమాతో మరో అవ కాశం దక్కింది. విష్వక్సేన్, యువన్, కృష్ణచైతన్య
కలయికలో సినిమా చేయడం మరింత ప్రత్యేకం” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం
పాల్గొంది.