పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మంగళవారం’. అజయ్ భూపతి
దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి రెడ్డి గునపాటి, సురేశ్ వర్మ ఎం.
నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాతర నేపథ్యంలో సాగే ‘గణగణ మోగాలిరా పాటని
బుధవారం విడుదల చేశారు. అజనీష్ లోక్ నాథ్ స్వరకల్పనలోని ఈ గీతానికి భాస్కరభట్ల
సాహిత్యం అందించగా, వి.ఎం. మహాలింగం ఆలపించారు. నిర్మాతలు మాట్లాడుతూ “కథలో
కీలక సందర్భంలో వచ్చే పాట ఇది. ఇందులోని పాటలూ కథని చెబుతాయి. త్వరలోనే
ట్రైలర్, సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ
“గ్రామీణ నేపథ్యంలో తెలుగుదనం ఉట్టిపడే కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది.
విభిన్న మైన యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుందన్నారు.