యంగ్ టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్
ఇండియా చిత్రం “దేవర”. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సైఫ్ అలీఖాన్
శక్తిమంతమైన ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.ఎన్టీఆర్ సరసన జాన్వీకపూర్
నటిస్తుంది. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ సమర్పకులు. బుధవారం సైఫ్ అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా
సినిమాలో ఆయన పోషిస్తున్న భైర పాత్ర లుక్ నీ విడుదల చేశారు. ఒక ద్వీపం
నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సముద్రం ముఖ్యభూమిక పోషించనున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లుక్స్ ని విడుదల చేశారు. అనిరుధ్ స్వరాలు
సమకూరుస్తున్నారు.