ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘దేవర’.
ఇప్పటికే విడుదల చేసిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి అద్భుతమైన స్పందన
లభించింది. విస్మరణకు గురైన ఓ తీరప్రాంతం నేపథ్యంలో తన వారిని
కాపాడుకోవడానికి మృగాల్లాంటి మనుషులతో ఓ ధీరోదాత్తుడైన వ్యక్తి చేసిన పోరాటం
ఏమిటన్నదే ఈ చిత్ర కథాంశం. ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ యాక్షన్ హంగులతో ఈ
చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్
తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. ఫ్లాష్
బ్యాక్ లో వచ్చే సీన్లలో తండ్రి పాత్రను రివీల్ చేస్తారని, ఇందులో ఎన్టీఆర్
60 ఏళ్ల పెద్దమనిషిగా కనిపిస్తారని అంటున్నారు. రొమాంచితమైన యాక్షన్, అదే
స్థాయి ఎమోషన్స్ తో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని
తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్
మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది
ఏప్రిల్ 5న ప్రేక్షకులముందుకు రానుంది.