వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా క్లైమాక్స్
షెడ్యూల్ పూర్తయింది. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో
నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాధ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా,
సారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై
వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్
అయింది. ఈ సందర్భంగా యూనిట్ వెంకటేష్ లుక్ ని రిలీజ్ చేసింది. వెంక టేష్
కెరీర్ లో 75వ చిత్రంగా ‘సైంధవ్’ రూపొందుతుంది. ప్రధాన తారాగణంపై 16 రోజుల్లో
కీలకమైన హై యాక్షన్ ఎమోషనల్ క్లైమాక్స్ షెడ్యూల్ ను పూర్తి చేశాం. యాక్షన్
ఎపిసోడ్ ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ తీర్చిదిద్దారు. తెలుగు, తమిళ్, కన్నడ,
మలయాళం, హిందీ భాషల్లో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22న ఈ మూవీ రిలీజ్
కానుంది అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్.