సినీ రంగంలో పారితోషికాల విషయంలో కథానాయికలు వివక్షకు గురవుతున్నారనే చర్చ
ఎప్పటి నుంచో నడుస్తున్నది. హీరోలతో పోల్చితే హీరోయిన్ లకు చాలా తక్కువ
మొత్తంలో రెమ్యునరేషన్ దక్కుతుంది. ఈ విషయం గురించి అగ్ర కథానాయిక కియారా
అద్వాణీ మాట్లాడుతూ పారితోషికాలలో వివక్ష గురించిన చర్చ వల్ల ఎలాంటి ప్రయోజనం
ఉండదు. మన ప్రతిభ ఆధారంగానే రెమ్యునరేషన్ నీ నిర్ణయిస్తారు. హీరోయిన ఛరిష్మా
సినిమాకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది? ప్రేక్షకులని తాను ఏ స్థాయిలో
ఆకర్షించగలదు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే పారితోషికాల
గురించి ఆలోచించకుండా ప్రతిభకు మెరుగులుదిద్దుకోవాలి. మన ప్రతిభకు ఎవరు ఎక్కువ
విలువనిస్తారో వారితో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. అప్పుడు పారితోషికాల గురించి
ఆలోచించాల్సిన అవసరమే ఉండదు అని చెప్పుకొచ్చింది ఈ భామ. సిద్ధార్ధ మల్హోత్రాతో
వివాహానంతరం సినిమాలకు కాస్త బ్రేక్ నిచ్చిన కియారా అద్వాణీ ప్రస్తుతం
బాలీవుడ్ లో వరుస సినిమాతో బిజీగా గడుపుతోంది.