మహేశ్ బాబు కథానాయుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం
“గుంటూరు కారం”. ఎస్. రాధాకృష్ణ నిర్మాత. శ్రీలీల, మీనాక్షి చౌదరి
కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ నెల 16 నుంచి మొదలు
కానుందని సమాచారం. హైదరాబాద్ లో దాదాపు నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్ లో
మహేశ్ పై యాక్షన్ సీక్వెన్స్ తో పాటు పలు కీలక సన్నివేశాలు
చిత్రీకరించనున్నట్లు తెలిసింది. కుటుంబ ప్రేక్షకులు మెచ్చే మాస్ యాక్షన్
కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో మహేశ్ మాస్ గెటప్ లో సరికొత్తగా
కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు.