అజయ్ దేవగణ్, కరీనా కపూర్, రణ్వీర్ సింగ్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో
నటిస్తున్న చిత్రం “సింగమ్ ఎగైన్”, రోహిత్ శెట్టి ఈ సినిమాను
తెరకెక్కిస్తున్నారు. ఇంతమంది అగ్ర తారాగనం నటిస్తున్న ఈ సినిమాపై భారీ
అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఈ చిత్రంలో
భాగం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దీపికా చాలా ఉత్సాహంగా ఉన్నారట.
రోహిత్ శెట్టి తీయనున్న ఈ సినిమాలో తొలిసారి దీపికా ఓ మహిళా పోలీసు అధికారిగా
కనిపించనుంది. ఈ యాక్షన్ పార్ట్ కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
దీపికా పాత్ర లేడీ సింగమ్ తరహాలో ఉంటుంది. అజయ్ దేవగణ్ కి చెల్లిగా దీపికా
పాత్ర ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీపికా తన పాత్రకోసం 35 నుంచి
40రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొననుంది అని అన్నారు. టైగర్ షాప్ అతిథి పాత్రలో
అలరించనున్నారు. సెప్టెంబరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది
ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తోంది చిత్రబృందం