నా వ్యక్తిగత విషయాల గురించి వదిలేస్తే, రాజకీయంగా నా మాజీ భర్త పవన్ కల్యాణ్
కి నా మద్దతు ఎప్పుడూ వుంటుంది. “రాజకీయాల్లోకి పిల్లలను, కుటుంబాన్ని
లాగకండి” అన్నారు పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్. గురువారం రోజు ఆమె
ఇన్ స్ట్రా లో ఓ వీడియోను షేర్ చేశారు. మొదటి నుంచి ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్
ను రాజకీయంగా సపోర్ట్ చేస్తున్నా. నాకు తెలిసినంత వరకూ ఆయన చాలా అరుదైన
వ్యక్తి. డబ్బు మనిషి కాదు, డబ్బుపై ఇంట్రెస్ట్ లేదు. ప్రతిక్షణం సమాజం
గురించి, సమాజానికి మంచి చేయాలని తపన పడే వ్యక్తి. రాజకీయంగా ఆయన సేవను
గుర్తించండి. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కుటుంబాన్ని పక్కన పెట్టి ఆయన
రాజకీయాల్లోకి వచ్చారు. ఒక్కసారి. ఆలోచించి ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి.
ప్రతిసారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకండి. మూడు పెళ్లిళ్లపై చర్చ
దయచేసి ఆపండి. ఈ రాజకీయాల్లోకి నలుగురు పిల్లలను లాగకండి. ఎందుకంటే వాళ్లు
చిన్న పిల్లలు అని ఆ వీడియోలో పేర్కొన్నారు రేణుదేశాయ్. ఈ విషయంతో పాటు పవన్
పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి వెబ్ సీరిస్, సినిమా చేస్తామని కొందరు
అంటున్నారని, దయచేసి ఈ రాజకీయాలోకి పిల్లలను, కుటుంబాన్ని లాగొద్దని ఒక
తల్లిగా నా వ్యక్తిగతంగా అభ్యర్థిస్తున్నాను’ అని ఆ వీడియోలో విన్నవించారు
రేణుదేశాయ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.