ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలపై ఫోకస్ పెట్టారు వరుణ్ తేజ్. ఆయన హీరోగా
బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ఓ చిత్రం
తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘వీటీ 13’
అనేది వర్కింగ్ టైటిల్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం
రూపొందుతోంది. వరుణ్ తేజ్ వాయుసేన అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా మూడో
షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్టూడియోలో
భారీ పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. ఈ సందర్బంగా విడుదల చేసిన పోస్టర్ లో
వరుణ్ తేజ్ యూనిఫాంలో యుద్ధ విమానం ముందు నిల్చొని పవర్ ఫుల్ లుక్ లో
కనిపించారు. ఈ చిత్రంలో వరుణ్ కు జోడీగా మాజీ విశ్వసుందరి మానుషీ చిల్లర్
నటిస్తున్నారు. ఆమె రాడార్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సోనీ పిక్చర్స్
ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం
డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలో టైటిల్ ను ప్రకటిస్తామని
నిర్మాణసంస్థలు తెలిపాయి.