ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. ఈ నెల 12వ తేదీన తెలుగు – తమిళ
భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును
హైదరాబాద్ – అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో నిర్వహించారు.
ఈ వేదికపై కృతి శెట్టి మాట్లాడుతూ .. “ఈ రోజున నేను ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా
ఉన్నానంటే అది మీరిచ్చిన కాన్ఫిడెన్స్ నే. ఈ సినిమా ట్రైలర్ కి మంచి
రెస్పాన్స్ వచ్చిందంటే, సినిమా కూడా బాగా నచ్చుతుందని భావిస్తున్నాను. ఇలాంటి
ఒక సినిమాకి పనిచేసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది” అని అంది.
“ఈ సినిమాలో నేను కాస్త డీ గ్లామర్ గా కనిపిస్తాను. నేను చేసిన ‘రేవతి’ పాత్ర
మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడూ నా ఫేవరేట్ చై గారే. నా
‘బంగార్రాజు’ .. నా శివ ఆయనే. ఈ సినిమాలో ఆయన చేసిన శివ పాత్ర లవ్ లో ఒక్క
రేవతి మాత్రమే కాదు .. అందరూ లవ్ లో పడిపోతారు. నాకు స్ఫూర్తిని ఇచ్చినవారిలో
ఆయన ఒకరు” అంటూ చెప్పుకొచ్చింది.