బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడానికి ట్రై చేసిందిగానీ, ప్రయోజనం
కనిపించలేదు. దాంతో ఆమె మళ్లీ టాలీవుడ్ దిశగా పరిగెత్తుకురాక తప్పలేదు. అయితే
అదృష్టం కొద్దీ మళ్లీ ఆమెను సక్సెస్ లే పలకరించాయి.
చాలా తక్కువ సమయంలో ఆమె ఇక్కడి నుంచి ‘ క్రాక్’ .. ‘వీరసింహా రెడ్డి’ ..
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో భారీ విజయాలను అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఆమె
చేతిలో ‘సలార్’ వంటి పాన్ ఇండియా సినిమా ఉంది. ప్రభాస్ సరసన నాయికగా ఆమె
నటిస్తున్న ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా తరువాత ఆమె నాని సరసన నాయికగా చేయడానికి అంగీకరించిందనే టాక్
బలంగా వినిపిస్తోంది. నాని తన 30వ సినిమాను కొత్త దర్శకుడితో చేస్తున్నాడు. ఈ
సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ ను తీసుకున్నట్టుగా సమాచారం. ఇందుకోసం ఆమెకి
భారీగానే పారితోషికం ముట్టిందని అంటున్నారు. మొత్తానికి శ్రుతి హాసన్ జోరు
కొనసాగుతోందనే చెప్పాలి.