బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యక్తి లింగ గుర్తింపునకు (జెండర్) సంబంధించి కీలక
వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీం కోర్టులో
కేసు నడుస్తున్న సమయంలో ఆమె ఈ అంశంపై స్పందించారు. తనను కేవలం ఓ మహిళగా చూడడం
తనకు నచ్చదని చెప్పారు.‘‘నీవు పురుషుడు/మహిళ/మరేదైనా కావచ్చు.స్త్రీ, పురుష భేదం, అసమానత్వం వల్ల
సమాజానికి ఎటువంటి ఉపయోగం ఉండదు . దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. ఆధునిక
ప్రపంచంలో నటి, మహిళా డైరెక్టర్ అన్న పదాలు వాడడం లేదు. నటులు, దర్శకులు అనే
పిలుస్తున్నాం. ప్రపంచం ముందు మీరు ఏం చేస్తున్నారో అదే మీకు గుర్తింపు
తెస్తుంది. అంతేకానీ, మీరు పడక మీద చేసేది గుర్తింపు కాదు. దయచేసి వాటిని మీ
గుర్తింపు కార్డులుగా ప్రదర్శించకండి. మరీ ముఖ్యంగా కత్తితో సంచరిస్తూ, మీ
వాంఛ అంగీకరించని వారి గొంతుకలు కోయకండి. మళ్లీ చెబుతున్నా మీ Gender మీకు
గుర్తింపు కాదు. ఆ విధంగా చేయకండి’’అని కంగనా రనౌత్ హితవు పలికారు.

వ్యక్తులను లింగత్వ కోణంలో లేదా భౌతిక రూపం ఆధారంగా ఎప్పుడూ చూడకూడదని రనౌత్
సూూచించారు. ‘‘మీ చుట్టూ ఉన్న వారి భౌతిక రూపం గురించి ఎందుకు సమయం వృధా
చేసుకుంటారు? మీకు ప్రపంచం గురించి ఆ విధమైన పరిమిత అవగాహన ఉంటే అంతకుమించి
ముందుకు వెళ్లలేరు. ఇతరులను అర్థం చేసుకోలేని వారు తమను తాము అర్థం
చేసుకోలేరు’’అని కంగనా రనౌత్ పేర్కొన్నారు.