సెంటర్లో అట్టహాసంగా జరిగింది. సల్మాన్‌ఖాన్, మనీశ్ పాల్ హోస్టులుగా
వ్యవహరించిన ఈ అవార్డుల వేడుకకు అలియా భట్, జాన్వీ కపూర్, భూమి పడ్నేకర్, పూజ
హెగ్డే, ఫాతిమా సనా ఖాన్, దియా మీర్జా, నర్గీస్ ఫక్రీ, రకుల్ ప్రీత్ సింగ్,
సన్నీలియోని, రేఖ, కాజోల్, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ సహా పలువురు బిగ్
సెలబ్రిటీలు హాజరయ్యారు.‘గంగూబాయి కథియావాడి’, ‘బాదాయ్ దో’ సినిమాలకు అవార్డులు వచ్చి పడ్డాయి.
గంగూబాయి కథియావాడి సినిమా ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు సహా 9 విభాగాల్లో
అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు సహా ఆరు కేటగిరీల్లో బాదాయ్ దో సినిమా
అవార్డులు గెలుచుకుంది. ‘బ్రహ్మాస్త్ర పార్ట్-1’లోని ‘కేసరియా’ పాట ఉత్తమ
సాహిత్య అవార్డుతోపాటు ఉత్తమ గాయకుడి అవార్డును దక్కించుకుంది. ఇక అత్యధిక
నామినేషన్లు దక్కించుకున్న ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాకు ఒక్క అవార్డు కూడా
రాలేదు.
అవార్డులు అందుకున్నది వీరే..
ఉత్తమ చిత్రంగా గంగూబాయి కథియావాడి సినిమా ఎంపిక కాగా, అదే సినిమాకు దర్శకత్వం
వహించిన సంజయ్ లీలా బన్సాలీ ఉత్తమ దర్శకుడిగా, కథానాయికగా చేసిన అలియా భట్
ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. బదాయ్ దో సినిమాకు గాను రాజ్‌కుమార్ రావ్ ఉత్తమ
నటుడిగా అవార్డు అందుకున్నాడు. అదే సినిమాలో నటించిన షీబీ చద్దా ఉత్తమ సహాయనటి
అవార్డు అందుకుంది. అలాగే, ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) బదాయ్ దో (హర్షవర్ధన్
కులకర్ణి), ఉత్తమ నటుడు (క్రిటిక్స్) సంజయ్ మిశ్రా (వధ్), ఉత్తమ నటి
(క్రిటిక్స్) టబు (భూల్ భులయా2), భూమి పెడ్నేకర్ (బదాయ్ దో), ఉత్తమ సహాయ
నటుడిగా జగ్‌జగ్ జీయో సినిమాకు గాను అనిల్ కపూర్ అవార్డులు అందుకున్నారు.
‘బ్రహ్మాస్త్ర: శివ’ సినిమాలోని కేసరియా పాటకు గాను అర్జిత్ సింగ్ ఉత్తమ
నేపథ్య గాయకుడిగా, అదే పాట రాసిన అమిత్ భట్టాచార్య ఉత్తమ గీత రచయితగా
అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఆండ్రియా కెవిచూసా
(అనేక్), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా జస్పాల్ సింగ్ సంధు, రాజీవ్ బర్నవాల్
(వధ్) అందుకోగా, ఉత్తమ తొలిచిత్ర నటుడిగా అంకుష్ గీదమ్ (ఝండ్) అవార్డులు
అందుకున్నారు. ప్రేమ్ చోప్రా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. జన్వీ
శ్రీమంకర్ (దోలాడియా: గంగూబాయి కథియావాడి) ఆర్డీ బర్మన్ అవార్డు అందుకున్నారు.