గోపీచంద్ – శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందిన ‘రామబాణం’ మే 5వ తేదీన
భారీస్థాయిలో విడుదల కానుంది. డింపుల్ హయతి కథానాయికగా నటించిన ఈ సినిమాలో,
జగపతిబాబు .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్
ఈవెంటును రాజమండ్రిలో నిర్వహించారు.ఈ వేదికపై శ్రీవాస్ మాట్లాడుతూ .. “ఈ సినిమాలో గోపీచంద్ – జగపతిబాబు
అన్నదమ్ములుగా నటించారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు కూడా వాళ్లిద్దరూ
నిజమైన అన్నదమ్ములా అనిపిస్తూ ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలనేది ఈ
సినిమాలో చూపించాము” అని అన్నారు.

“ఈ సినిమా ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ సినిమాలకి మించి ఉంటుంది. యాక్షన్ .. ఎమోషన్
.. కామెడీ .. ఏది చూసినా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గోపీచంద్ ఫ్యాన్స్ కి ఈ
సినిమా తప్పకుండా నచ్చుతుంది. మే 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతుంది .. అందరూ
కూడా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి” అని చెప్పుకొచ్చారు.