పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ
యాక్షన్ ఎంటర్టయినర్ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో
ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే.ఓజీ చిత్రం షూటింగ్ ముంబయిలో మొదలుపెడుతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ
ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. పవన్ కల్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో
పాల్గొంటారని తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను కూడా పవర్ స్టార్
అభిమానులకు కానుకగా అందించింది.

ఓజీ చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం షాట్ జరుపుకుంది. ఈ
సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో తారాగణం వివరాలను త్వరలో
ప్రకటించనున్నారు.
ఈ సినిమా దర్శకుడు సుజీత్ ఇప్పటిదాకా తీసిన సినిమాలు రెండే. రన్ రాజా రన్,
సాహో చిత్రాలతో యాక్షన్ మూవీస్ పై తన పట్టు నిరూపించుకున్నారు. ఇప్పుడు తన
మూడో చిత్రాన్ని ఏకంగా పవన్ కల్యాణ్ తో సెట్స్ పైకి తీసుకెళుతున్నారు.
కాగా, ఓజీలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించవచ్చు అని టాక్
వినిపిస్తోంది.