టాలీవుడ్ సూపర్ స్టార్స్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇప్పుడు
బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తన
డ్రీమ్ మూవీ ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ కోసం వారిలో ఒకరిని ఎంపిక చేయడమే
అందుకు కారణం. ఆర్ఆర్ఆర్తో ఎన్టీఆర్, పుష్పతో అల్లు అర్జున్ హిందీతో పాటు
నార్త్‌లోనూ దూసుకుపోయిన సంగతి తెలిసిందే.మహాభారత కథానాయకుడు ‘అశ్వత్థామ’ ప్రధాన ఇతివృత్తంతో ఆదిత్య ధర్, జియో
స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారనే టాక్ వినిపిస్తోంది.
వాస్తవానికి, ఆదిత్య ధర్ తన క్రేజీ ప్రాజెక్ట్ కోసం విక్కీ కౌశల్‌ను
తీసుకోవాలని మొదట అనుకున్నాడు, కానీ అది వర్కవుట్ కాలేదు. విక్కీ కౌశల్
మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని జియో స్టూడియోస్ ఈ ప్రతిపాదనను
తిరస్కరించినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత అశ్వథ్థామ కోసం రణ్వీర్ సింగ్ పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే
ఒక్కరోజులోనే ఈ ప్రాజెక్ట్ నుంచి రణవీర్ సింగ్ ప్రతిపాదన మారిపోయింది. ఈ
నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న సౌత్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్,
అల్లు అర్జున్ పేర్లను అశ్వత్థామ టీమ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాదు ఇందులో సమంత కూడా నటిస్తుందని బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం
జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.