హీరో సినిమాతో ప్రేక్షకులను అలరించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు
మేనల్లుడు, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అశోక్ గల్లా మరో కొత్త సినిమాతో
వెండితెరపై కనిపించనున్నాడు. ఏప్రిల్ 5న అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా
హీరో మహేష్ బాబు ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అశోక్ గల్లా
నెక్ట్స్ చిత్రానికి సంబంధించిన టీజర్ ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.కృష్ణ మనవడిగా, మహేష్ బాబు మేనల్లుడిగా వారసత్వం పునికి తెచ్చుకుని తెలుగు
సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో అశోక్ గల్లా . ‘భలే మంచి రోజు’,
‘శమంతకమణి’, ‘దేవదాస్’ లాంటి విభిన్న చిత్రాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య
దర్శకత్వంలో అశోక్ గల్లా ‘హీరో’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. 2022లో
రిలీజైన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఈ సినిమాపై
భారీ అంచనాలు నెలకొన్నా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఊహించిన స్థాయిలో
కలెక్షన్లు రాకపోగా.. నష్టం కూడా వాటిల్లిందని వార్తలు కూడా వినిపించాయి. ఈ
విషయంపై హీరో అశోక్ గల్లా సైతం ఇటీవల స్పందించారు. ‘2022 సంవత్సరం నా జీవితంలో
వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా ఎన్నో అనూహ్యకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
ఇలాంటి ఆందోళకరమైన పరిస్థితుల మధ్య…. ఎంతో కాలంగా ఉన్న నా కల సాకారం
అయ్యింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మా కుటుంబానికి.. మాటలకందని నష్టం కూడా
జరిగిందంటూ ట్వీట్ చేశారు.