ఒలింపిక్ పతక విజేత బాక్సర్ విజేందర్ సింగ్ తన రాబోయే చిత్రం “కిసీ కా భాయ్ కిసీ కి జాన్” తారాగణంలో చేరినట్లు సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ శనివారం ప్రకటించారు. ప్రముఖ భారతీయ బాక్సర్ 37వ పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ కాస్టింగ్ అప్డేట్ను పంచుకున్నారు. “హ్యాపీ బర్డే హమారే బాక్సర్ భాయ్ బాక్సర్ విజేందర్… వెల్కమ్ ఆన్ బోర్డ్…” అని నటుడు విజేందర్ తెలిపాడు. అదేవిధంగా ఇతర నటీనటులు రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, జాస్సీ గిల్‌లతో ఉన్న ఆన్సెట్ ఫోటో ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.