టాప్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళి (SS. Rajamouli) దర్శకత్వం వహించిన సినిమా
‘ఆర్ఆర్ఆర్’ (RRR). బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. వరల్డ్ వైడ్‌గా
రూ.1200కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదలై ఏడాది
అవుతున్నా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బ్రిటన్ నటుడు జేమీ హ్యారిస్
(Jamie Harris) ‘ఆర్ఆర్ఆర్’ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని చూసి
హాలీవుడ్ నేర్చుకోవాలన్నారు.‘టు జాక్స్’, ‘నైట్ ఆఫ్ కప్స్’, ‘లాస్ ట్రాన్స్ మిషన్’ , ‘ది వెస్ట్ సైడ్
స్టోరీ’ వంటి చిత్రాల్లో జేమీ హ్యారీస్ నటించారు. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో
పాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను చివరగా
ఆర్ఆర్ఆర్ సినిమాను చూశాను. చిత్రం ఒక జోనర్లో మొదలై అకస్మాత్తుగా వేరే
జోనర్‌కు మారింది. డ్యాన్స్ సీక్వెన్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా
ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రాలను హాలీవుడ్ మరిన్ని రూపొందిస్తుందని
ఆశిస్తున్నాను. మూవీ మొత్తం ఒకే జోనర్లో కొనసాగాల్సిన అవసరం లేదు. వివిధ
అంశాలను మిళితం చేసి రూపొందించే ఇటువంటి సినిమాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి’’
అని జేమీ హ్యారీస్ తెలిపారు. ‘ఆర్ఆర్ఆర్’ ను స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్
కామెరూన్‌తో సహా హాలీవుడ్‌కు చెందిన అనేక మంది ఇప్పటికే ప్రశంసించారు. తాజాగా
ఈ జాబితాలోకి జేమీ హ్యారిస్ చేరారు.

విప్లవకారులైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్‌లను స్ఫూర్తిగా తీసుకుని
‘ఆర్ఆర్ఆర్’ ను రూపొందించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్
చరణ్ (Ram Charan) హీరోలుగా నటించారు. ఆలియా భట్, అజయ్ దేవగణ్, ఒలివియో
మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆ
చిత్రం అకాడమీ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్
కేటగిరిలో ‘నాటు నాటు’ (Naatu Naatu) ఆస్కార్‌ను అందుకుంది.