నటనతో బి-టౌన్ లో లేడీ సూపర్ స్టార్ ఎదిగి, జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో అవార్డలున అందుకుంది. అంతేకాదు రాజకీయాలపై కూడా కంగనా స్పందిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. తాజాగా కంగనా మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ కీీలక వ్యాఖ్యలు చేసింది. తాను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వచ్చిందని, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు వీలైనంత వరకు సేవ చేయాలని కోరుకుంటున్నట్లు సినీ నటి కంగనా రనౌత్ శనివారం తెలిపారు. ఇన్నాళ్లు “రాజ్యకీయంలోకి రాబోతున్నారా?” అన్న ప్రశ్ననని ఖండిస్తూ వచ్చిన కంగనా, తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. తాను రాజకీయాలకు వ్యతిరేకం కాదని, భవిషత్తులో పొలిటికల్స్ లో తన పాత్ర ఉండనున్నట్లు క్లారిటీ ఇచ్చింది కంగనా. తన సొంత రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే అవకాశం వస్తే అది తనకు గర్వకారణంగా ఉంటుందని అన్నారు. తాను ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతానని…. ప్రభుత్వం తన భాగస్వామ్యం కోరుకుంటే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానని చెప్పింది ఈ బాలీవుడ్ బ్యూటీ. ప్రజలకి సేవ అవకాశం వస్తుంది అంటే హిమాచల్ ప్రదేశ్ లోని ‘మండి’ నుంచి పోటీచేస్తా” అంటూ కుండ బద్దలు కొట్టేసింది కంగనా రనౌత్.