కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకు వెళుతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి
(Anil Ravipudi) ఓ డిఫరెంట్ సినిమా రూపొందిస్తున్నారు. భాగ్య నగరంలో శరవేగంగా
చిత్రీకరణ జరుగుతోంది. ఈ రోజు విడుదల తేదీ గురించి చిత్ర బృందం కీలక ప్రకటన
చేసింది.విజయదశమికి విడుదల
దసరా బరిలో బాలకృష్ణ సినిమా విడుదల కానుందని కొన్ని రోజుల క్రితం నుంచి
వినబడుతోంది. ఈ రోజు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ”విజయ దశమికి
ఆయుధ పూజ” అని చెప్పేశారు. ఇటీవల విడుదలైన బాలకృష్ణ ఫస్ట్ లుక్ అభిమానులను
ఆకట్టుకుంది. దసరా బరిలో మూడు సినిమాలు ఉన్నాయి. రవితేజ హీరోగా రూపొందుతోన్న
పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ను అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు
అనౌన్స్ చేశారు. అదే రోజున ఉస్తాద్ రామ్ పోతినేని, బాలయ్యతో ‘సింహ’,
‘లెజెండ్’, ‘అఖండ’ వంటి విజయవంతమైన సినిమాలు ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను
తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా కూడా విడుదల కానుంది. తమిళ స్టార్ విజయ్
హీరోగా లోకేష్ కనగరాజ్ తీస్తున్న ‘లియో’ అక్టోబర్ 19న విడుదలకు రెడీ అయ్యింది.
బాలకృష్ణ రాకతో మొత్తం మీద దసరా బరిలో నాలుగు సినిమాలు ఉన్నట్టు
అయ్యింది. బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తొలి చిత్రమిది.
దీనిని షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
బాలకృష్ణకు కుమార్తెగా శ్రీలీల నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కథలో చాలా
కీలకమైన శ్రీలీల పాత్రలో కనిపించనున్నారు.