కీర్తి సురేష్ ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. కారణం ఆమె నటిస్తున్న
చిత్రాలు కావచ్చు, వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న ప్రేమ వ్యవహారం గురించి
కావచ్చు. నటి మేనక, నిర్మాత సురేష్ ల వారసురాలు కీర్తి సురేష్. అలా సినీ
కుటుంబం నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఇదు ఎన్న మాయం చిత్రం ద్వారా కథానాయకిగా
కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా,
శివకార్తికేయన్‌తో జత కట్టిన రజనీమురుగన్ మంచి విజయాన్ని అందించింది. అలా
కథానాయకిగా స్థిరపడి పోయిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన మహానటి చిత్రంతో
జాతీయ ఉత్తమ అవార్డును గెలుచుకుంది.అదేవిధంగా కమర్షియల్ కథా చిత్రాల్లో నటిస్తూనే, నటనకు అవకాశం ఉన్న హీరోయిన్
ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ తనకంటూ గుర్తింపును తెచ్చుకుంది.
దాంతోపాటు ప్రేమ, పెళ్లి అంటూ వార్తల్లోనూ తరచూ చిక్కుకుంటోంది. కీర్తీ
సురేష్ పెళ్లి అని, ఓ వ్యాపార వేత్తతో త్వరలో ఏడడుగులు వేయడానికి సిద్ధం
అవుతోందంటూ ప్రచారం జరుగుతోంది. ఇలాంటి విషయాలపై కీర్తీ సురేష్ ఎప్పుడూ
స్పందించిన దాఖలాలు లేవు. అయితే తొలి సారిగా ఆమె తల్లి మేనక స్పందించారు. ఆమె
ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కీర్తి సురేష్ ప్రేమలో పడిందని, పెళ్లికి సిద్ధం
అవుతోందనీ గాసిప్స్ చాలానే వస్తున్నాయని. అయితే కీర్తీ.

ఎవరిని ప్రేమించినా ఆ విషయాలు తమకు చెబుతుందని, దాన్ని తాము బహిరంగంగా మీడియా
ద్వారా వెల్లడిస్తామని చెప్పారు. అయితే కీర్తీ ఎవరినీ ప్రేమించడం లేదని, ఆమె
గురించి జరుగుతున్న ప్రచారం అవాస్తవం అనీ చెప్పారు. కీర్తీ సురేష్ గురించి
వదంతులు దొర్లుతున్నాయంటే, ఆమె నటిగా ఎదుగుతోందని అర్థం అని మేనక
పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో కీర్తీసురేష్ బిజీగా ఉంది.
తెలుగులో నానికి జంటగా నటించిన దసరా చిత్రం గురువారం పాన్ ఇండియా స్థాయిలో
తెరపైకి రానుంది.