చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకీ అంటే అభిమానం ఎక్కువ.
గతేడాది ఎఫ్ 3 సినిమాతో కడుపుబ్బా నవ్వించిన వెంకీ.. ఇటీవల మాస్ కా దాస్
విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రను పోషించారు.ఇక ఇటీవల రానాతో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఈ ఏడాది డైరెక్టర్ శైలేశ్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేస్తున్నారు.
కెరియర్ పరంగా వెంకీకి ఇది 75వ సినిమా. వెంకట్ బోయనపల్లి నిర్మిస్తోన్న ఈ
సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వీడియో.. యాక్షన్ ఓ రేంజ్లోనే
ఉంటుందనేది అర్థమయ్యింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్
రాలేదు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్రయూనిట్. ఈ ఏడాది
డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చెబుతూ ఓ
పోస్టర్ రిలీజ్ చేశారు. భారీ పేలుడు పదార్థాలకు సంబంధించిన కంటైనర్ పై..
తుపాకీ పట్టుకుని కూర్చున్న వెంకీ పోస్టర్ ఆకట్టుకుంటోంది. అప్పటికే ఆయన
గాయపడి ఉండడం చూస్తుంటే.. ఇంకా ఎవరైనా వస్తే రానీ చూసుకుందాం అన్నట్లుగా ఆయన
అక్కడ కూర్చుని వెయిట్ చేస్తున్నాడనే విషయం తెలిసిపోతుంది. ఈ సినిమాలో
నవాజుద్దీన్ సిద్దికీ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.