అందుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు రవితేజ. ఆయన హీరోగా రూపొందుతున్న చిత్రం
రావణాసుర త్వరలో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి
తెలిసిందే. ఏప్రిల్ ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు
రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. ఈ
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.ముఖ్యంగా రవితేజ చూపిస్తున్న లవ్ కామెడీ యాక్షన్ తో కూడిన సీన్స్ కట్ చేసిన ఈ
ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ మొత్తం మీద వాడు క్రిమినల్ లాయర్ కాదు
లాంచ్ అదైన క్రిమినల్ అనే డైలాగ్ మొత్తానికి హైలైట్ గా నిలుస్తోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ను ఎక్కడితో
తీసుకెళ్లిపోయిందని చెప్పక తప్పదు. ‘మర్డర్ చేయడం క్రైమ్, దొరక్కుండా చేయడం
ఆర్ట్, అండ్ ఐ యామ్ ఎన్ ఆర్టిస్ట్’ ‘ఈ భూమి మీద నన్నేవడైనా ఆపగలిగే
వాడున్నాడంటే అది నేనే’ అనే లాంటి డైలాగ్స్ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
మాస్‌తో పాటు క్లాస్ ఆడియెన్స్‌ను కూడా ఆకట్టుకునే విధంగా ఈ ట్రైలర్ కట్
చేశారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ
నెగెటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నాడని అంటున్నారు. సుధీర్ వర్మ
దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీం వర్క్స్
బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ
సినిమాలో అను ఇమ్మానుయేల్, మేఘ ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత
పొన్నాడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో సుశాంత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక
తాజాగా విడుదలైన ట్రైలర్ ద్వారా ఈ సినిమాలో రవితేజ ఒక లాయర్ పాత్రలో
కనిపిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. ఇప్పటివరకు మనం చూడని ఒక సరికొత్త
పాత్రలో రవితేజ దర్శనమిస్తున్నాడని ఈ ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది .