ఆత్మహత్య చేసుకున్న ఘటన షాక్ కలిగిస్తోంది. హోటల్లోని రూం నంబర్ 105లో
ఫ్యాన్‌కు వేలాడుతూ ఆకాంక్ష దుబే మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న
పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్టుమార్టం
నిమిత్తం తరలించారు. నిజానికి ఆకాంక్ష దుబే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా
తెలియాల్సి ఉంది.ఆకాంక్ష భదోహి జిల్లాలోని చౌరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పార్సిపూర్ గ్రామ
నివాసి. శుక్రవారం రాత్రి షూటింగ్ ముగించుకుని హోటల్‌కి వెళ్లిన ఆమె ఉదయం
మ్యాకప్ మాన్ వెళ్లి చూసే సరికి ఇలా చనిపోయి వేలాడుతూ కనిపించింది. నిజానికి
ముందుగా ఆదివారం ఉదయం మేకప్ మ్యాన్ ఆకాంక్ష దూబేకి ఫోన్ చేశాడు. ఫోన్
తీయకపోవడంతో మేకప్ మ్యాన్ హోటల్ కి వెళ్లి చూడగా అక్కడ తలుపు ఓపెన్ చేయడం
లేదు. ఉదయం నుంచి బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ చేయకపోవడంతో హోటల్ వర్కర్స్ మేకప్
మేన్‌కు సమాచారం అందించారు.
ఆ తర్వాత హోటల్ వర్కర్స్,మేకప్ మ్యాన్ తో కలిసి తలుపు తట్టినా లోపలి నుంచి
ఎలాంటి స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సమక్షంలో మాస్టర్
కీతో మేనేజర్ తలుపు తీయగా ఆకాంక్ష దుబే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది.
ఇక ఏసీపీ సారనాథ్ నటి మొబైల్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు
ప్రారంభించారు. అలాగే ఆమె కాల్ వివరాలను కూడా సేకరిస్తున్నారు. ఇక ఆకాంక్ష
దుబే ఆత్మహత్య చేసుకున్న కొన్ని గంటల తర్వాత చివరి పాట విడుదలైంది. ‘యే ఆరా
కభీ హర నహీ’ పేరుతో ఈ పాటను భోజ్‌పురి నటుడు పవన్ సింగ్, ఆకాంక్షపై
చిత్రీకరించారు.
ఇక ఆత్మహత్యకు ముందు ఆకాంక్ష దుబే ఇన్స్టాగ్రామ్ లైవ్ లో విపరీతంగా ఏడుస్తూ
కనిపించింది. ప్రస్తుతం అయితే ఆ వీడియో తొలగించబడింది. అలాగే అర్థరాత్రి
ఆకాంక్ష దుబే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను షేర్ చేసింది. ఆ రీల్ లో భోజ్‌పురి
సాంగ్ ‘హిలోర్ మేరే’కు అద్దం ముందు బెల్లీ డ్యాన్స్ చేసింది. నిజానికి కొన్ని
రోజుల క్రితం వాలెంటైన్స్ డే సందర్భంగా నటి తన సహనటుడు సమర్ సింగ్‌తో ఉన్న
ఫోటోను పోస్ట్ చేస్తూ హ్యాపీ వాలెంటైన్స్ డే అని రాయడంతో అతనితో ప్రేమలో
ఉన్నట్టు ప్రకటించినట్టు అయింది. ఇక ఆత్మహత్య తర్వాత, ఆకాంక్ష దుబే పాత పోస్ట్
వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ.. ‘ప్రేమ నీతోనే ఉంది, కానీ నీ
ప్రేమ నన్ను గట్టిగా లాగి చెంపదెబ్బ కొట్టింది’ అని ఆమె రాసుకొచ్చింది.