తెలిసిందే. సమంత కరోనా కంటే కాస్త ముందుగా.. ఫ్యామిలీ మెన్ సీజన్ 2 కోసం సమంత
ఎంతో ఫిట్‌గా ఉన్న సమయంలో ఈ శాకుంతలం స్క్రిప్ట్ వచ్చింది. సమంత సైతం అప్పుడు
ఫ్యామిలీ ప్లానింగ్‌లో ఉందని, ఎక్కువ టైం అయితే ఇవ్వలేను అని చెప్పినట్టుగా
నీలిమ గుణ ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.అయితే శాకుంతలం పాత్రకు తాను సెట్ అవుతానో లేదో ఎలా ఉంటుందో అని ట్రయల్ షూట్
చేశారట. ఒళ్లంతా నగలు నింపేసి, శాకుంతలం పాత్రకు తగ్గట్టుగా రెడీ చేశారట. గుణ
శేఖర్ అది చూసి ఏం మాట్లాడుకుండా ఉన్నారట. ఎందుకంటే ఆ టైంలో సమంత కండలు
తిరిగిన దేహం, పొట్ట భాగంలో పలకల దేహం ఉండటం, భుజాలు కాస్త బలంగా ఉండటంతో ఆ
పాత్రకు సెట్ కాదని అనుకున్నాడేమోనట.
అప్పుడు తాను వేరే పాత్ర కోసం రెడీ అయ్యానని, దానికి తీసుకున్న ట్రైనింగ్ వేరు
అని చెప్పింది సమంత. అయితే ఈ శాకుంతలం కోసం తన డైట్‌ను వర్కౌట్లను పూర్తిగా
మార్చేశానని, మళ్లీ కాస్త సాఫ్ట్‌గా మారానని, నాన్ వెజ్ కూడా మానేసినట్టుగా
చెప్పుకొచ్చింది. అయితే సినిమా కోసం తాను తీసుకున్న ప్రతీ నిర్ణయం సరైనదేనని,
సినిమా చూశాక ఎంతో సంతృప్తిగా ఉందని, తాను తీసుకున్న నిర్ణయం సరైందేనని సమంత
తెలిపింది.
ఒక సినిమాకు కొంత మంది వంద శాతం పని చేస్తారు.. కొంత మంది ఎనభై శాతం పని
చేస్తారు.. ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు పని చేస్తారు.. అయితే ఈ సినిమాకు
మాత్రం ప్రతీ ఒక్కరూ వంద శాతం కష్టపడి పని చేశారు.. సినిమా చూశాక నాకు అదే
అనిపించింది.. అంటూ సమంత చెప్పుకొచ్చింది.