పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్‌పై సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
చేశారు. పవన్ కళ్యాణ్‌కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సుమన్.. అది ఆయనకు
దక్కిన అదృష్టమని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఎదగాలంటే రాసిపెట్టి ఉండాలని
ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆల్ ఇండియా
సుమన్ యువసేన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ఏర్పాటుచేసిన 2023 సంవత్సర
క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సుమన్ పాల్గొన్నారు. క్యాలెండర్‌ను
ఆవిష్కరించి అనంతరం మీడియాతో మాట్లాడారు.‘పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఆదరణ, యూత్ ఫాలోయింగ్ అద్భుతంగా ఉంది. ఎక్కడికెళ్లినా
ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది పెద్ద అదృష్టమని చెప్పుకోవాలి. రాజకీయం,
వ్యాపారంలో ఏదైనా రాసిపెట్టి ఉండాలి. ఎప్పటి వరకు ఆ రాత ఉంటుందో అప్పటి వరకు
అది నడుస్తుంది. మీరు నేను ఏమీ మార్చలేం. మారాల్సిన టైమ్ వచ్చినప్పుడు
ఆటోమేటిక్‌గా మారిపోతుంది’ అని సుమన్ అన్నారు.

అంటే, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి టైమ్ రావాలని.. రాసిపెట్టి ఉంటే ఆయన సీఎం
అవుతారని పరోక్షంగా సుమన్ చెప్పుకొచ్చారు. అయితే, సినిమా విషయంలో పవన్ కళ్యాణ్
లాంటి అదృష్టం అందరికీ లేదని సుమన్ అన్నారు. ‘ ఈ మనిషి వస్తే మనందరం బాగుంటాం
అని జనం మనసులో ఎప్పుడు పడుతుందో.. ఆ టైమ్ వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. ఒక
ఆర్టిస్టుగా పవన్ కళ్యాణ్‌కు నేను శుభాకాంక్షలు చెబుతున్నాను. ఆరోగ్యం
జాగ్రత్తగా చూసుకొని రాజకీయాల్లో రాణించాలి’ అని సుమన్ అన్నారు.