బలగం సినిమాలో క్లైమాక్స్ లో బుర్రకథను అద్భుతంగా ఆలపించి కోట్లాదిమందిని
ఎమోషనల్ గా ఆకట్టుకున్న వరంగల్ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన
బుర్రకథ కళాకారులు కొమరవ్వ, మొగులయ్య లను బలగం డైరెక్టర్ వేణు యెల్దండి
శుక్రవారం పరామర్శించారు. మొగులయ్య కిడ్నీలు చెడిపోయి డయాలసిస్
చేయించుకుంటున్నాడు. మొగులయ్య దీనస్థితిని తెలుసుకున్న డైరెక్టర్ వేణుగోడికి
వెళ్లి మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రభుత్వం మాట్లాడి వైద్య
సహాయం అందిస్తామన్నారు. డయాలసిస్ తో పాటు ఉచితంగా మందులు అందేలా చర్యలు
తీసుకుంటామన్నారు. కొమరవ్వ మోగిలయ్యలను డైరెక్టర్ ఘనంగా సత్కరించారు.
డైరెక్టర్ వేణు తో పాటు మిత్ర బృందం సిరిసిల్ల నాయకులు జిందం చక్రపాణి, బొల్లి
రామ్మోహన్, బాలు కాయితి సిరిసిల్ల, దార్ల సందీప్, పెట్టం సుధాకర్, లిరిక్
రైటర్ శ్యామ్ కాసర్ల, యాంకర్ గీత భగత్ లు కలిసి రూ.70 వేలు ఆర్థిక సహాయాన్ని
అందించారు. మరో రూ.30 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. మనోధైర్యాన్ని
కల్పించారు. వారితో కలిసి భోజనం చేశారు. దుగ్గొండిని సందర్శించిన వేణు
బృందాన్ని గ్రామ ప్రజాప్రతినిధులు సత్కరించారు. నర్సంపేట సిఐ పులి రమేష్ తో
పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని బుర్రకథ
కళాకారులు కొమురవ్వ మొగిలయ్యలను అభినందించారు. దుగ్గొండి పేరును
ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారని వారిని ప్రశంసించారు.