హైదరాబాద్ : మహబూబ్‌నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
నియోజకవర్గానికి పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్
జరగనుండగా మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
నియోజకవర్గానికి పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్
సాయంత్రం 4 గంటల వరకు సాగనుంది. మొత్తం 29,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును
వినియోగించుకోనుండగా ఎన్నికల అధికారులు 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు
చేసినట్లు తెలిపారు. ఇందులో 126 మెయిన్ పోలింగ్ స్టేషన్లు ఉండగా 11 అదనపు
పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం 29,720 ఓటర్లలో పురుషులు 15,472 మంది కాగా
స్త్రీలు 14,246 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు.137 పోలింగ్ స్టేషన్లలో
మహబూబ్‌నగర్ జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్లు, నాగర్ కర్నూల్ జిల్లాలో 14
పోలింగ్ స్టేషన్లు, వనపర్తి జిల్లాలో 7, జోగులాంబ గద్వాల జిల్లాలో 11,
నారాయణపేట్ జిల్లాలో 5, రంగారెడ్డి జిల్లాలో 31, వికారాబాద్ జిల్లాలో 18,
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 14, హైదరాబాద్ జిల్లాలో 22 పోలింగ్ స్టేషన్లను
ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 593 పోలింగ్ అధికారులు, సిబ్బందిని
నియమించారు. మొత్తం 137 పోలింగ్ కేంద్రాలు కాగా ఒక్కో పోలింగ్ కేంద్రానికి 137
మంది పీవోలు, 137 మంది ఏపీవోలు, 319 ఇతర పోలింగ్ సిబ్బందిని నియమించారు.
అందులో 146 మందిని రిజర్వ్‌గా నియమించారు. రిసెప్షన్ సెంటర్ సరూర్ నగర్ ఇండోర్
స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం 12 మంది
సెక్ట్రోల్ అధికారులను నియమించారు.