మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న వనితలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే తమ
జీవితాన్ని తీర్చిదిద్దిన మహిళల సేవలను గుర్తుతెచ్చుకుంటూ వారందరికీ
ధన్యవాదాలు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ విషెస్ తెలిపారు. ‘ ప్రపంచంలో తమ
న్యాయబద్ధమైన స్థానం కోసం పోరాడుతున్న స్ఫూ్ర్తిదాయకమైన మహిళలందరికీ సెల్యూట్
చేస్తున్నాను. భవిష్యత్ తరాలు ముందుకెళ్లడానికి మీరు ఊపిరి అందిస్తున్నారు.
ఇక నా జీవితంలో అత్యంత ప్రభావవంతమైన మహిళలు వీరే’ అంటూ తన తల్లి అంజనమ్మ,
భార్య సురేఖలతో దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసుకున్నారు చిరంజీవి.ఇక సినిమాల విషయానికొస్తే.. వాల్తేరు వీరయ్య బంపర్‌హిట్ కావడంతో పుల్
జోష్లోఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. థియేటర్లలో అదరగొట్టిన ఈ మాస్
ఎంటర్టైనర్ ఇప్పుడు ఓటీటీలో రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా తర్వాత భోళా
శంకర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు మెగాస్టార్. అజిత్ వేదాళం రీమేక్‌గా
తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
మహానటి కీర్తి సురేశ్ చిరు చెల్లెలిగా కనిపించనుంది. మెహర్ రమేశ్
తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ స్వరాలు
సమకూరుస్తున్నారు.