తెలుగు, హిందీ భాషల్లో మార్చి 22న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్టెన్స్ ఎమోషనల్ డ్రామా గీత సాక్షిగా.
ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించిన ఈ చిత్రం అనౌన్స్మెంట్ రోజు నుంచి
అందరిలో తెలియని ఆసక్తిని క్రియేట్ చేయటమే కాకుండా ప్రమోషనల్
యాక్టివిటీస్‌తో పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇటీవల విడుదలైన మూవీ
ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్‌తో సినిమాపై మంచి వైబ్ క్రియేట్ అయ్యింది.
హోలీ సందర్భంగా సోమవారం రోజున మేకర్స్ ప్రేక్షకులందరికీ హోలీ
శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సినిమాను మార్చి 22న తెలుగు, హిందీ భాషల్లో
విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్లో
గీత సాక్షిగా జడ్జ్మెంట్ డే మార్చి 22న అని తెలియజేశారు
గీత సాక్షిగా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలను
ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని గీత సాక్షిగా మరోసారి ప్రూవ్ చేసింది.
గీతసాక్షిగా క్రియేటర్స్ ఇప్పుడు నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకులకు మంచి
కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను అందిస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమాలో
చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా కథాంశం తిరుగుతుంటుందని
మేకర్స్ తెలియజేశారు.