సైఫ్ అలీఖాన్ హెచ్చరిక
సాధారణంగా సెలబ్రిటీలపై ప్రజల దృష్టి ఎప్పుడూ ఉంటుంది. వారికి సంబంధించిన
ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తుంటారు. అందువల్ల
వారికి ప్రైవసీ అనేది ఉండదు. బయటికి వెళితే మీడియా వెంటాడుతుంది.
ఫొటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తుంటారు. కొంత మంది కెమెరామెన్స్ ఈ విధంగానే సైఫ్
అలీ ఖాన్, కరీనా కపూర్ ను అర్ధరాత్రి 2గంటల సమయంలో వెంబడించారు.
అపార్ట్మెంట్ గేటు దాటి లోపలికి చొరబడ్డారు. ఫలితంగా సైఫ్ అసహనానికి
గురయ్యాడు. పిక్స్ తీసుకోవడానికి తమ బెడ్రూమ్లోకి కూడా రావాలని ఘాటుగా
వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. అపార్ట్మెంట్
వాచ్‌మన్‌ను సైఫ్ అలీ ఖాన్ తొలగించాడంటూ పలు వదంతులు షికార్లు కొట్టడం
మొదలయ్యాయి. ఫలితంగా ఈ వార్తలన్నింటిపై సైఫ్ అలీ ఖాన్ స్పందించాడు.
‘‘బిల్డింగ్ సెక్యూరిటీ గార్డును తొలగించలేదు. ఈ ఘటనలో సెక్యూరిటీ తప్పేమీ
లేదు. ఫొటోగ్రాఫర్స్‌కు వ్యతిరేకంగా నేను ఎటువంటి చట్టపరమైన చర్యలను తీసుకోవడం
లేదు. మేం పార్టీ నుంచి వచ్చే సమాయానికి దాదాపుగా 20మంది ఫొటోగ్రాఫర్స్ అక్కడ
ఉన్నారు. మా మీద లైట్స్‌ను ఫోకస్ చేశారు. అర్ధరాత్రి పూట ఈ విధంగా చేయడం
సరైనదేనా..? కెమెరామెన్స్ ప్రవర్తించాల్సిన తీరు కాదది. ప్రతి ఒక్కరు వారి
హద్దుల్లో ఉండాలి. మా ఇంటి బయట ఎల్ల వేళలా ఫొటోగ్రాఫర్స్‌కు నేను సహకరించాను.
వారు మా ప్రైవేట్ స్పేస్‌లోకి కూడా వచ్చి గీత దాటారు. అందుకే బెడ్ రూం
కామెంట్స్ చేయాల్సి వచ్చింది. పిల్లలు ఆటలు ఆడుతున్నప్పుడు కూడా వీడియోలు షూట్
చేస్తున్నారు. ఈ విధంగా చేయాల్సిన అవసరం లేదు. పాఠశాల లోపలికి రాకూడదు. ఎవరికీ
నిజం తెలియదు. ప్రతి ఒక్కరు అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
అందరికి ధన్యవాదాలు’’ అని సైఫ్ అలీ ఖాన్ తెలిపాడు.